కనీసం నెలకు ఒకసారి సభ్యులకు సంస్కారము ఎలా అందుబాటులో ఉంచాలో నిర్ణయించడానికి స్థానిక నాయకులు సలహా ఇస్తారు
యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘము యొక్క ప్రథమ అధ్యక్షత్వము మరియు పన్నెండు మంది అపొస్తలుల సమూహము 2020 మార్చి 12 న ఈ క్రింది లేఖను ప్రపంచవ్యాప్తంగా సంఘ సభ్యులకు పంపారు.
ప్రియమైన సహోదర, సహోదరీలారా,
2020, మార్చి 11వ తేదీన మా లేఖలో వాగ్దానం చేసినట్లుగా, ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 కు సంబంధించిన మారుతున్న పరిస్థితులను మేము పర్యవేక్షిస్తూనే ఉన్నాము. మేము స్థానిక సంఘ నాయకులు, ప్రభుత్వ అధికారులు మరియు వైద్య నిపుణుల సలహాలను పరిగణించాము మరియు ఈ విషయాలలో ప్రభువు యొక్క నడిపింపును కోరాము. మేము ఇప్పుడు నవీకరించబడిన క్రింది ఆదేశాలను అందిస్తున్నాము.
వెంటనే ప్రారంభించి, సంఘ సభ్యుల బహిరంగ సభలన్నీ తదుపరి ఆదేశము వచ్చేవరకు ప్రపంచవ్యాప్తంగా తాత్కాలికంగా నిలిపివేయబడుతున్నాయి. వీటిలో ఉన్నవేవనగా:
- స్టేకు సమావేశాలు, నాయకత్వ సమావేశాలు మరియు ఇతర భారీ సమావేశాలు
- సంస్కార కూడికలతో సహా సమస్త ప్రజారాధన సేవలు
- శాఖ, వార్డు మరియు స్టేకు ప్రోత్సాహ కార్యక్రమాలు
సాధ్యమైన చోట, ఏవైనా ఆవశ్యకమైన నాయకత్వ సమావేశాలను దయచేసి సాంకేతికతను ఉపయోగించి నిర్వహించండి. నిర్దిష్ట ప్రశ్నలకు స్థానిక యాజకత్వ నాయకులను సంప్రదించవచ్చు. ఇతర విషయాలకు సంబంధించిన తదుపరి దిశానిర్దేశము అందించబడుతుంది.
కనీసం నెలకు ఒకసారి సభ్యులకు సంస్కాారము ఎలా అందుబాటులో ఉంచాలో నిర్ణయించడానికి బిషప్పులు తమ స్టేకు అధ్యక్షునితో ఆలోచన చెయ్యాలి.
వారి పరిచర్య ప్రయత్నాలలో ఒకరినొకరు సంరక్షించుకోవాలని సభ్యులను మేము ప్రోత్సహిస్తున్నాము. ఇతరులను దీవించడానికి మరియు ఉద్ధరించడానికి మనం రక్షకుని ఉదాహరణను అనుసరించాలి.
అనిశ్చితి ఉన్న ఈ సమయంలో ప్రభువు ప్రేమ గురించి మేము మా సాక్ష్యమిస్తున్నాము. ప్రతి పరిస్థితిలోనూ యేసు క్రీస్తు సువార్తను జీవించడానికి మీరు మీ వంతు కృషి చేస్తున్నప్పుడు ఆనందాన్ని పొందటానికి ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తారు.
భవదీయులు,
ప్రథమ అధ్యక్షత్వము మరియు పన్నెండుమంది అపొస్తలుల సమూహము